PM-SYM (Pradhan Mantri Shram Yogi Maandhan) ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ : చేరితే నెల నెలా రూ.3 వేల పెన్షన్.. పథకం పూర్తి వివరాలు!

Admin
By -
0

 

ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ : చేరితే నెల నెలా రూ. 3000 వేల పెన్షన్.. పథకం పూర్తి వివరాలు!.....






కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అందిస్తోంది. చేరితే ప్రతి నెలా రూ.3 వేలు పొందొచ్చు. దీని కోసం మీరు నెలకు రూ.55 నుంచి రూ.200 కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అందిస్తోంది. చేరితే ప్రతి నెలా రూ.3 వేలు పొందొచ్చు. దీని కోసం మీరు నెలకు రూ.55 నుంచి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అందిస్తోంది. చేరితే ప్రతి నెలా రూ.3 వేలు పొందొచ్చు. దీని కోసం మీరు నెలకు రూ.55 నుంచి రూ.200 


కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా పలు రకాల పథకాలు అందుబాటులో ఉంచింది. వీటిల్లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.


శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్ వివరాలు

పథకం పేరుప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన
ఆవిష్కరణకేంద్ర ప్రభుత్వం
లబ్ధిదారులుఅసంఘటిత రంగ కార్మికులు
ప్రయోజనంప్రతి నెలా రూ. 3 వేల పెన్షన్
అధికారిక వెబ్‌సైట్
pdf click here
Officel WEB click here


ప్రతి నెలా రూ.3 వేలు
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కింద అర్హత కలిగిన వారికి ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి. అయితే ఈ డబ్బులు 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి లభిస్తాయి. దీని వల్ల కార్మికులకు వయసు మల్లిన తర్వాత ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే జమ అవుతాయి.
నెలకు రూ.55 నుంచి చెల్లించాలి
పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒక విషయం తెలుసుకోవాలి. ప్రతి నెలా కొంత మేర డబ్బులు కడుతూ వెళ్లాలి. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి ఉంటుంది. మీరు ఏ వయసులో ఈ స్కీమ్‌లో చేరారనే అంశం ప్రాదిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం కూడా ఆధారపడుతుంది. అంటే 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.55 కట్టాలి. అదే 40 ఏళ్లలో చేరితే నెలకు రూ.200 చెల్లించాలి.
అర్హతలు ఇలా
- అసంఘటిత రంగానికి చెందిన వారై ఉండాలి.
-18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి.
- నెలకు రూ.15 వేల వరకు ఆదాయం పొందే వారు పథకంలో చేరొచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్లు
- బ్యాంక్ అకౌంట్
- ఆధార్ కార్డు
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి
పథకం ప్రయోజనాలు
పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్ ప్రత్యేకతలను గమనిస్తే.. అర్హత కలిగిన వారు పథకంలో ఎవరైనా చేరొచ్చు. ఇది స్వచ్ఛంద పెన్షన్ పథకం. పథకంలో చేరిని వారికి కచ్చితమై పెన్షన్ వస్తుంది. ఒకవేళ పథకంలో చేరిన వారు మరణిస్తే.. అప్పుడు వారి భాగస్వామికి సగం పెన్షన్ వస్తూనే ఉంటుంది. లేదంటే డిపాజిట్ చేసిన డబ్బులను వెనక్కి పొందొచ్చు.
పథకంలో ఎలా చేరాలి?
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకంలో చేరాలని భావించే వారు దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెలితే సరిపోతుంది. అక్కడ అవసరమైన డాక్యుమెంట్లు అందించి పథకంలో చేరొచ్చు. లేదంటే మాన్ ధన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే ఈ పని పూర్తి చేయొచ్చు.



NOTE: పూర్తి వివరాలకు కామన్ సర్వీస్ సెంటర్ ని సంప్రదించండి, మీకు ఈ పథకం లో చేరిన తరువాత మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మీరు కట్టిన అమౌంట్ ఒడ్డి తో సహా మీ అమౌంట్ క్లయిమే చేసుకోవొచ్చు 


Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)