Ysr Cheyutha Eligible Scheme Details వైఎస్సార్ చేయూత పథకం.. ఒక్కొక్కరికి రూ.75 వేలు.. అర్హతలు ఇవే!

Admin
By -
0

 

వైఎస్సార్ చేయూత పథకం.. ఒక్కొక్కరికి రూ.75 వేలు.. అర్హతలు ఇవే!



వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్స్‌లో.... వైఎస్సార్ చేయూత కూడా ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి ప్రభుత్వం మొత్తంగా రూ.75 వేలు అందిస్తోంది.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్‌ను అమలు చేస్తోంది. చిన్న పిల్లల దగ్గరి నుంచి సీనియర్ సిటిజెన్స్ వరకు ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో విధమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాల వల్ల చాలా మంది ప్రయోజనం పొందొచ్చు. ఏపీ సర్కార్ అందిస్తున్న పథకాల్లో వైఎస్సార్ చేయూత కూడా ఒకటి. ఈ స్కీమ్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వైఎస్సార్ చేయూత పథకం పూర్తి వివరాలు ఒక్కొక్కరికి రూ.75 వేలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి. ఒక్కో విడత కింద రూ.18750 లభిస్తాయి. ఇప్పటికే రెండు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో రెండు విడతల డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

పథకం అర్హతలు ఇవే


చేయూత పథకంలో చేరాలని భావించే వారు కచ్చితంగా అర్హతులు కలిగి ఉండాలి. 45 ఏళ్ల వయసు తప్పనిసరి. అలాగే 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పథకంలో చేరొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూత స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఆధార్ కార్డులోని వయసును ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే


వైఎస్సార్ చేయూత పథకంలో చేరాలని భావించే వారు కొన్ని డాక్యుమెంట్లను కచ్చితంగా కలిగి ఉండాలి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

* చిరునామా రుజువు
* ఆధార్ కార్డ్
* కుల ధృవీకరణ పత్రం
* నివాస ధృవీకరణ పత్రం
* వయస్సు రుజువు
* బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
* పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
* మొబైల్ నంబర్
* రేషన్ కార్డు

జీవనోపాధి కూడా కల్పిస్తారు


ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం కింద మరో ప్రయోజనం కూడా కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు కూడా ఏర్పాటు చేయిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌, రిలయన్స్‌, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా ఆసక్తి కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది.


Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)