THE MAHATMA GANDHI NATIONAL RURAL EMPLOYMENT GUARANTEE ACT 2005 (MGNREGA) ఆంద్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం

Admin
By -
0

ఆంద్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం

(MAHATMA GANDHI NATIONALRURAL EMPLOYMENT GUARANTEE )

 


ఆంద్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం  గురించి మీకు తెలుసా............

  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆంద్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం గా మారుస్తూ 2016,  జనవరి 28 న రాష్ట్ర ప్రభుత్వం G.O. M.S. 27 ను విడుదల చేసింది,ఈ పథకాన్ని రాస్టం లో 13 జిల్లాలోని 661 మండలాలు 13,104 గ్రామా పంచాతీలు 47,638 ప్రాంతాలలోను అమలు చేయడం జరిగింది. ఈ పథకం ధ్వారా ఇప్పటివరుకు కోటి 16 లక్షలు మందికి 1562 కోట్ల పనిదినాలు కల్పించి రూ,, 22.836  కోట్ల విలువైన పనులను చేపట్టడం జరిగింది,ఈ పథకం ధ్వారా2015 ఆగస్టు 31 న రాస్టం లోని కరువు పరిస్థితులు నెల కొన్న సందర్భాలలో మరొక 50 రోజులు పనిదినాలు కల్పించేలా చెర్యలు తీసుకోవడం జరిగింది ,నవంబర్ 5 2016 రాస్టం లోని 241 కరువు మండల్ లలో 150 రోజులు పనిదినాలు కల్పిస్తూ గ్రామీణాభివృద్ధిశాఖ  ఆదేశాలు జారీచేసింది. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలులో అగ్రగామిగా నిలిచింది

పథకం వివరాలు

 పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు కృషి చేస్తుంది. సుమారు మూడవ వంతు పనులను స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించబడినవి. మరిన్ని వివరాలు భారత ప్రగతి ద్వారంలో ఉన్నాయి. పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది.

         దేశంలోని 5.97 కోట్ల కుటుంబాలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు

  మార్చి 24, 2023 రోజు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూరల్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్‌పై ఆర్థిక ఏడాది 2023-24కు సంబంధించి ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం 2005 చట్టంలోని (National Rural Employment Guarantee Act) సెక్షన్ 6 (1) ప్రకారం వేతనాల సవరణ చేపట్టినట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు అమలులోకి వస్తాయి. పెంచిన కూలీ రోజుకు రూ.7 నుంచి రూ.26 వరకు ఉంది. పర్సంటేజ్‌లో చూసుకున్నట్లయితే కూలీల వేతనాలు 2 శాతం నుంచి 10 శాతం మేర పెరగనున్నాయి.

విలువ పరంగా చూస్తే హరియాణాలో పెరిగిన కూలీ అత్యధికంగా రూ.357గా ఉంటుంది. అది గతంలో రూ.331గా ఉండేది. మరోవైపు.. పర్సంటేజ్ టర్మ్స్‌లో చూసుకున్నట్లయితే రాజస్థాన్‌లో రికార్డ్ స్థాయిలో పెరిగింది. ఆర్థిక ఏడాది 2022-23లో రోజుకు రూ.231గా ఉండగా ఇప్పుడు అది రూ.255కి చేరింది. ఎంఎన్ఆర్ఈజీఏ (mgnrega wages state wise) అనేది దేశంలోని గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఉపాధి హామీని అందిస్తోంది. ఏడాదికి 100 రోజులు తప్పనిసరిగా పని కల్పిస్తుంది. నిరక్ష్యరాశ్యులైన కూలీలకు ఆర్థిక ఏడాదిలో 100 రోజులు పని అందిస్తుంది ప్రభుత్వం. అయితే, ఆర్థిక ఏడాది 2023-24లో ఛత్తీస్‌గడ్, మధ్య ప్రదేశ్‌లో అత్యల్పంగా రూ.221గా మాత్రమే ఉండడం గమనార్హం. గతంలో రూ.204గా ఉండగా దానికి రూ.17 పెంచి రూ.221కి చేర్చారు. అలాగే కర్ణాటక, గోవా, మేఘాలయా, మణిపూర్‌లో తక్కువ వేతనాలే ఉన్నాయి. మార్చి 9, 2023 లెక్కల ప్రకారం ఉపాధీ హామీ పథకం కింద 5.97 కోట్ల కుటుంబాలు పని చేస్తున్నాయి. వేసవిలో అత్యధికంగా పని దినాలు ఉంటాయి. గ్రామాల్లో పని లేని సమయంలో పేద కుటుంబాలను ఆదుకునే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది అప్పటి పథకం.

 

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)