CSC Website Basic Setup FAQ, Setup New Password to new CSC Account and CSC setup Process

Admin
By -
0

 

CSC Website Basic Setup FAQ, Setup New Password to new CSC Account



CSC Website Basic Setup FAQ, Setup New Password to new CSC Account. రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో CSC (కామన్ సర్వీస్ సెంటర్) సంబంధించిన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. మొత్తం 170 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గ్రామ సచివాలయంలో PS Gr-vi (డిజిటల్ అసిస్టెంట్ కు), వార్డు సచివాలయాల్లో వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ వారికి వారి మొబైల్ నెంబర్, పేరుపై లాగిన్ ఐడి లు ఇవ్వడం జరిగింది. లాగ్ ఇన్ ఐడి 12 అంకెలు ఉంటుంది. ఆధార్ నెంబర్ కాదు. ఇంకా ఐడి లు ఎవరికైనా అందకపోయినా ఉంటే సంబంధిత జిల్లా GSWS టెక్నికల్ టీం వారిని కాంటాక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వారిని కాంటాక్ట్ అయ్యే ముందు పర్సనల్ మెయిల్, సచివాలయం మెయిల్,CSC వాట్సాప్ గ్రూపు లో చెక్ చేసి అప్పటికి లేకపోతే టీం వారిని MOT ల ద్వారా కాంటాక్ట్ అవ్వండి.

ప్రస్తుతం అన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

CSC ఖాతాలు ఏ విధంగా కొత్తగా పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి?

How to Setup New Password to new CSC Account?

లాగిన్ ఐడి వచ్చిన తర్వాత క పాస్వర్డ్ సెట్ చేసుకోవడం కోసం మొదట http://digitalseva.csc.gov.in వెబ్ సైట్ ఓపెన్ కుడివైపు పైన ఉన్న Login ఆప్షన్లు క్లిక్ చేసి Forget Password అనే ఆప్షన్ ను క్లిక్ చేసి User ID,Mail ID (Personal-Registered), Captcha Code ఎంటర్ చేసి GET A NEW PASSWORD పై క్లిక్ చేయాలి. మెయిల్ ఐడి కు” Forgot Your Password On Your Project “అని మెయిల్ కు వస్తుంది అందులో ” Click here to create Password “పై క్లిక్ చేయాలి.New Password, Confirm Password దగ్గర కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి Change Password పై క్లిక్ చేయాలి. Password మారుతుంది. ఒక చోట రాసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. CSC హోమ్ పేజీ లో లాగిన్ పై క్లిక్ చేసి User Name లేదా E-mail ID ఎంటర్ చేసి,మార్చిన Password ఎంటర్ చేసి CAPTCHA ఎంటర్ చేసి SIGN పై క్లిక్ చేయాలి. లాగిన్ అయ్యి హోం పేజీ ఓపెన్ అవుతుంది.

CSC Wallet PlN ను ఎలా మార్చుకోవాలి?

How to change CSC Wallet PlN?

మొదటిసారి లాగిన్ అయిన వెంటనే Wallet PlN నెంబర్ ను మార్చుకోవాలి. అందుకు గానూ Menu లో Account ఆప్షన్లలో My Profile అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.Change Wallet PlN పై క్లిక్ చేశాక రెండు ఆప్షన్లు చూపిస్తాయి.

1.Do You Know Current Wallet PlN?

2.How do You want to receive OTP?

మొదటి ఆప్షన్ ఎవరు అయితే మొదటి PIN ను సెట్ చేసుకుని దానిని మార్చుకోవాలి అని అనుకుంటారు వారు సెలెక్ట్ చేయాలి. అప్పుడు పాత Password, కొత్త Password, కొత్త Password మరల ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి.

కొత్తగా సెలెక్ట్ చేసిన వారు రెండో ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని మూడు విధాలుగా కొత్త Password పెట్టుకోవచ్చు.

1.Mobile

2.OTP On CSC App

3.Secure Code CSC App

మొదటిది సెలెక్ట్ చేసుకొని Generate OTP ను క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.OTP ఎంటర్ చేశాక Submit పై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త PIN ఇంటర్ చేసి మరల Confirm వద్ద ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి.

Wallet లో అమౌంట్ ను జతచేయటం, తీసివేయడం ఎలా?

How to Add/ Remove Amount In CSC Portal Wallet?

మొదటగా CSC-డిజిటల్ సేవ పోర్టల్ లో కి లాగిన్ అవ్వాలి. Menu లో Wallet ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. మొదట అమౌంట్ add చేయటానికి Amount దగ్గర ఎంత Add చెయ్యాలో అంత ఎంటర్ చేయాలి. Transaction Type లో

1.Add Money (అమౌంట్ add చేయడం కోసం)

2.Revert Money (అమౌంటు రిటర్న్ వేయడం కోసం)

పై రెండిట్లో ఏది చేస్తున్నారు అది సెలెక్ట్ చేసి, Wallet PlN ఎంటర్ చేయాలి. Remarks లో తప్పకుండా సచివాలయం కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత submit పై క్లిక్ చేయాలి. వాలెట్ లోకి అమౌంట్ Add/Remove ఇవ్వటం జరుగుతుంది. సర్వీసులు చేసే సమయంలో అమౌంటు సరిపోనట్టు అయితే ఆ అమౌంట్ వెంటనే Add చేసుకొని చేయాలి.
ఒక్కసారి 50,000 రూపాయలు వరకు Add చేసుకునే అవకాశం ఉంటుంది.

Wheare to Get CSC Training Materials?

CSC ట్రైనింగ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి?

గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ హోం పేజి లో లెర్నింగ్ కార్నర్లో ఎంప్లాయి కార్నర్ ఓపెన్ చేయాలి.
CSC సర్వీస్ ట్రైనింగ్ మెటీరియల్ లో CSC Work Flow &CSC Training Materials లు అందుబాటులో ఉన్నాయి

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)